హాఫ్ శారీలో మెరిసిపోతున్న పాయల్
టీవీ రంగంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన పాయల్(payal) తర్వాత చన్నా మేరేయా(Channa mereya) తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్ఎక్స్ 100(RX100) సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన పాయల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమెను స్టార్ ను చేయలేకపోయాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైన పాయల్ కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ట్రెడిషనల్ హాఫ్ శారీ లో మెరిసింది. ఈ ఫోటోల్లో అమ్మడు మెరూన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లోని హాఫ్ శారీ ధరించి దానికి తగ్గట్టు మెడలో చోకర్ నెక్లెస్, దానికి మ్యాచింగ్ గా జుంకాలు, చేతికి గాజులు, నుదుటిన పాపిటి బిళ్ల, నడుముకు వడ్డాణం ధరించి పదహారణాల పడుచులా దర్శనమివ్వగా, ఈ అవుట్‌ఫిట్ లో పాయల్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








