వారు ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలి: వెంకయ్య నాయుడు
దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సంఘం (ఈసీ)పై వస్తోన్న విమర్శలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) స్పందించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇవాళ ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి. రాజీనామా కోరడం తప్పు కాదు. వ్యక్తిగత విమర్శలు సరికాదు. ఓట్లను మÖకుమ్మడిగా తొలగించారనేది అపోహ మాత్రమే. సీఈసీ (CEC), ప్రధాని (Prime Minister) రాజీనామా చేయాలన్న డిమాండ్ సమంజనం కాదు అన్నారు. గెలిస్తే తమ ఘనత అని, ఓడిపోతే మాత్రం ఈవీఎం (EVM)లను నిందిస్తున్నారని ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని, రాజ్యాంగ బద్ధ సంస్థలను వీధుల్లోకి లాగడం తగదని ఆయన పేర్కొన్నారు. ఐక్యంగా ఉన్నామని ఎన్నికల సంఘం (Election Commission) సభ్యలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. వారు ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలి. అంతిమంగా దేశప్రతిష్ఠ దెబ్బతినకుండా వ్యవహరించాలి.నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ హింసాయుతంగా చేయడం మంచిది కాదు అని అన్నారు.








