ఇండియన్3 కోసం ధర్మన్ త్యాగం చేయాల్సిందేనా?
కమల్ హాసన్(kamal haasan) ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కీలకమైన డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారా? సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ధర్మన్(Dharman), సంక్రాంతి 2027 రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకోగా, కమల్ హాసన్ నటించిన ఇండియన్3(Indian3) కూడా అదే సీజన్‌పై దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకే టైమ్ లో రెండు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకురావడం కంటే, వాటి రిలీజ్ ప్లాన్స్ ను వేర్వేరుగా రూపొందించడంపై నిర్మాత కమల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇండియన్3 కి సంబంధించిన పెండింగ్ షూటింగ్ వర్క్స్ ను పూర్తి చేయడంతో పాటు, డైరెక్టర్ శంకర్(Sankar) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు నిజమైతే, సినిమా రిలీజ్ కు అవసరమైన పనులను వేగవంతం చేసే అవకాశముంది. అదే సమయంలో ధర్మన్ షూటింగ్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో, రెండు ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్ ను బ్యాలెన్స్ చేయడం కమల్ హాసన్‌కు కీలకంగా మారవచ్చు. ఒక సినిమా కోసం మరో సినిమాను వెనక్కి జరపడం అనేది కేవలం రిలీజ్ డేట్స్ మార్పు మాత్రమే కాకుండా, మార్కెట్ లెక్కలతో ముడిపడిన డెసిషన్ గా చూడాల్సన అవసరముంది.
ఈ నేపథ్యంలో ధర్మన్ను సమ్మర్ 2027కు వాయిదా వేసి, ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలనే ఆలోచన పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియన్3 సంక్రాంతికి రిలీజ్ కాకపోతే ధర్మన్ ముందుగా అనుకున్న షెడ్యూల్లోనే వచ్చే అవకాశముంది. దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. చివరకు ఏ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది కమల్ హాసన్ తీసుకునే డెసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది.








