గెజిట్ విడుదలైన తర్వాతే .. ఎన్నికల నోటిఫికేషన్ : ఎస్ఈసీ
రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) విడుదల చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ (Notification) విడుదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదల సమయానికి రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయితే, కొత్త ఓటర్ల జాబితాలో ఎన్నికలు నిర్వహిస్తామని, లేదంటే, ప్రస్తుత ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. రిజర్వేషన్లు (Reservations) ఖరారై తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.








