‘అ’ మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌గా అందర్ని థ్రిల్ల్ చేస్తుంది: హీరో రాహుల్ విజయ్
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘అ’ (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడంతో పాటు. ఇటీవల విడుదల చేసిన ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న థియేట్రికల్ విడుదల చేస్తున్నారు.డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌లో రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ఇదేనా ఇదేనా అనే లిరికల్ వీడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమాకూర్చిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్ ఆలపించారు. సుమన్ చిక్కాల ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటను జర్నలిస్ట్‌లు పర్వతనేని రాంబాబు, శివమల్లాల, వేణు బిక్కి, వాసు సజ్జా, హేమ మాలిని లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లిరిసిస్ట్ సుమన్ మాట్లాడుతూ ” ఇది నా తొలిపాట. శ్రీచరణ్ నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నాలోని పాటల రచయితను మీకు ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా అందరికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
సింగర్ షణ్ముఖ్ మాట్లాడుతూ ” శ్రీచరణ్ పాకాల నన్ను నమ్మి ఈ పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఈ పాట ఈ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది’ అన్నారు.
కో ప్రొడ్యూసర్ అభినవ్ మాట్లాడుతూ ” ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి కారణమైన ఆర్టిస్ట్‌లకు,టెక్నిషియన్స్‌కు నా కృతజ్క్షతలు.
నిర్మాత గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ ” ఈ పాట అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. స్నేహితులు అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో బాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా బాగా రావడానికి కారణమైన అందరికి కృతజ్ఞతలు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ” ఈ సినిమా నా కెరీర్లో వెరీ వెరీ స్పెషల్. రాహుల్ విజయ్, అర్చన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. వెరీ టాలెంటెడ్ పీపుల్ అందరూ. దర్శకుడు సాయి చూడటానికి సున్నితంగా ఉంటాడు కానీ ఈయన చేసిన క్రైమ్ థ్రిల్లర్ చూస్తే అందరూ షాక్ అవుతారు. అందరికి ఈ ఇదేనా ఇదేనా పాట నచ్చిందని నమ్ముతున్నాను’ అన్నారు.
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ ” రాహుల్ విజయ్ ఎంతో ఏమేజింగ్ యాక్టర్. కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నాడు. ఎంతో క్రమశిక్షణ గల ఆర్టిస్ట్. నేను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంతో సపోర్ట్ చేశాడు. హీరోయిన్ అర్చన అయ్యర్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. సినిమాలో పాటలతో పాటు ఆర్ఆర్ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ గురించి సినిమా విడుదల గురించి మాట్లాడుకుంటారు. అందరి సపొర్ట్‌తో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చానని నమ్ముతున్నాను , టైటిల్ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం… అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. రాహుల్ విజయ్ను ఓ సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది’ అన్నారు.
అర్చన అయ్యర్ మాట్లాడుతూ ” ఈ సారి అతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇదకొ ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్. ఈ సాంగ్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల ఎంతో ఇంటెన్స్‌గా సంగీతాన్ని అందించాడు. రాబోయే పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నన్ను నమ్మి ఎంతో మంచి పాత్రను ఇచ్చారు. నాకెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మంచి పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నాను. ఈసినిమాను నిర్మాతలు ఎంతో పాషన్‌తో నిర్మించారు. రాహుల్ విజయ్ ఎంతో వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంతే మంచి వ్యక్తిత్వం ఉన్న గ్రేట్ పర్సన్’ అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ ” ఈ పాటకు సంగీతం, సాహిత్యం, పిక్చరైజేషన్ అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి. డబ్బులంటే సరిపోదు. సినిమాపై ఎమోషన్ ఉండాలి. అలాంటి ఎమోషన్ ఉన్న నిర్మాతలు వీళ్లు. అందరూ మల్టీ టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్.ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. శ్రీచరణ్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్. ఈ పాటతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను బెటర్మెంట్ కోసం అక్టోబర్ 30న ఫర్ఫెక్ట్ ప్లాన్‌తో విడుదల కాబోతుంది.’ అ’ మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌గా మీ అందరికి థ్రిల్ల్‌ను పంచబోతుంది ‘ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు నరేష్, కో ప్రొడ్యూసర్ అభినవ్.వి.కునపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా ‘AH’ తెరకెక్కుతున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచబోతుంది.








