గ్లోబల్ స్థాయిలో మరో అడుగు.. రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ!
ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్లలో ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కథను తెరపై ఆవిష్కరించే విధానం, భారీ యాక్షన్ సీన్స్, ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు వారణాసి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో మరింత గుర్తింపు సాధించేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బాహుబలి(bahubali) సినిమాలతో ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్(RRR) మూవీతో అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. ఆస్కార్ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటిన ఈ సినిమా ఆయన టాలెంట్ కు మరో నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబు(mahesh babu)తో తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi)పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఎన్ని సక్సెస్‌లు వచ్చినా రాజమౌళి తన సరళమైన వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఆయన కొనసాగించే సత్సంబంధాలు కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణం ఎంతోమంది యంగ్ డైరెక్టర్లకు స్ఫూర్తిగా మారింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజమౌళికి శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ఆయన నుంచి మరిన్ని అద్భుతమైన సినిమాలు రావాలని సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.








