మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులే విజయం : మంత్రి నారాయణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో 123 మున్సిపాలిటీల్లో (Municipalities) కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని మంత్రి నారాయణ (Narayana) ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు (Elections) అడ్డుకోవడం ద్వారా 16వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా చేయాలని చూసి వైసీపీ (YCP) భంగపడిందని ఎద్దేవా చేశారు. సర్ బూచి చూపించి స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వైసీపీని భంగపాటుకు గురి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం వైసీపీకి ఇష్టం లేదు. కానీ, కోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి అని అన్నారు.








