అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
కర్నూలు మాజీ ఎమ్మెల్యే యంఏ గపూర్ (MA Gafoor) కుమారుడు పీవీ కిరణ్ (PV Kiran) అమెరికాలో మృతి చెందారు. అక్టోబర్ 2న గుండెపోటుతో ఆయన నిద్రలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer)గా కిరణ్ పనిచేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కిరణ్ 2వ తేదీ నుంచి ఆఫీస్కు రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు స్నేహితులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు రూమ్ వద్దకు వెళ్లి చూడగా మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. మృతదేహం కర్నూలు (Kurnool) కు తీసుకురావడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని సమాచారం.








