కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయ్ ధరమ్ తేజ్.. డైరెక్టర్ ఎవరంటే?
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్(sai dharam tej) తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. కొంతకాలంగా సంబరాల ఏటి గట్టు(sambarala yeti gattu) సినిమాతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా, తర్వాతి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. కొత్త కథతో ఆడియన్స్ ను పలకరించేందుకు సిద్ధమైన సాయ్ ధరమ్ తేజ్, ఈ నెలలోనే తన కొత్త సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు తేజ కాకుమాను(teja kakumanu) దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను అనిల్ సుంకర(anil sunkara) కు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) నిర్మించనుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే, సినిమా కథాంశం, ఇందులో నటించనున్న ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
అనిల్ సుంకరతో కలిసి పనిచేయాలని సాయ్ ధరమ్ తేజ్ చాలాకాలంగా అనుకుంటున్నారు. గతంలో శ్రీకృష్ణదేవరాయల జీవిత కథ ఆధారంగా ఓ భారీ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. వీరు పోట్ల(Veeru potla) దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఆ ప్రాజెక్ట్ అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్కు ప్రాధాన్యతనిస్తూ సాయ్ ధరమ్ తేజ్ ఈ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది.








