జయకృష్ణ నెక్ట్స్ ప్లాన్స్.. మూడో సినిమాపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన జయకృష్ణ(ghattamaneni jaya krishna) మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆర్ఎక్స్100 (RX100) ఫేమ్ అజయ్ భూపతి(Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సి. అశ్వినీదత్(C. Aswanidutt), జెమిని కిరణ్(Gemini kiran) నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా నిరాశపరచడంతో జయకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఆయన రెండో సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం, మైత్రీ మూవీ మేకర్స్(mythi movie makers) ఈ యంగ్ హీరో కోసం సరైన కథను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. కథ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశముంది. వచ్చే ఏడాది ఈ సినిమా ఫైనల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, జయకృష్ణ మూడో సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అనిల్ సుంకర(Anil sunkara) నేతృత్వంలోని ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) ఈ సినిమాను నిర్మించేందుకు డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం. సామజవరగమన(Samajavaragamana) సినిమాతో సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు(ram abbaraju) ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్‌పై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్ అబ్బరాజు, శ్రీవిష్ణు(Sree vishnu)తో ఫ్యామిలీ ప్యాక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, జయకృష్ణ కూడా తన వద్దకు వస్తున్న కథలను పరిశీలిస్తూ తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే టార్గెట్ తో జయ కృష్ణ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాడని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.








