తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) నూతన ధర్మకర్తల మండలి ఎన్నిక
బర్న్హామ్, యునైటెడ్ కింగ్డమ్ – 10 అక్టోబర్ 2026: యునైటెడ్ కింగ్డమ్లోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న రిజిస్టర్డ్ ఛారిటీ , సాంస్కృతిక సంస్థ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL), తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) 2026 అక్టోబర్ 10వ తేదీన బర్న్హామ్లోని బర్న్హామ్ గ్రామర్ స్కూల్లో విజయవంతంగా నిర్వహించింది.
ఈ సమావేశంలో ప్రస్తుత ధర్మకర్తల మండలి (Board of Trustees – BoT) వార్షిక నివేదికలతో పాటు ఆర్థిక నివేదికలను సభ్యులకు సమర్పించింది. తమ పదవీకాలంలో TAL నిర్వహించిన వివిధ సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాల వివరాలను సభ్యులకు తెలియజేసింది.
పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు శ్రీ రవి సబ్బా ధర్మకర్తల మండలి సభ్యులు, అలాగే TAL అభివృద్ధికి నిరంతరం సహకరించిన అనిల్ అనంతుల, అశోక్ మడిశెట్టి, కిరణ్ కప్పేట, రవి మోచర్ల, సత్య పెదిరెడ్డి, వెంకట్ నీలా , TAL సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ధర్మకర్తల మండలి మూడేళ్ల పదవీకాలం ముగిసినట్లు ప్రకటిస్తూ, AGM రోజునుంచి అనుబంధ కమిటీలన్నీ రద్దు అవుతాయని తెలియజేశారు.
అనంతరం ఎన్నికల అధికారి, శ్రీ రాధా మనోహర్ మాచెర్ల ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మండలికి అభినందనలు తెలిపిన ప్రస్తుత మండలి సభ్యులు, TAL భవిష్యత్తు అభివృద్ధి కోసం తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికైన ధర్మకర్తల మండలి
రాబోయే మూడేళ్ల పాటు TALకు నాయకత్వం వహించనున్న నూతన ధర్మకర్తల మండలి సభ్యులు:
1.శ్రీ వంశీ మోహన్ శింగలూరి – Chairman
2.శ్రీ గిరిధర్ పుత్లూరు – Vice Chairman
3.శ్రీమతి సునీత అరిగె
4.శ్రీ సత్య పెదిరెడ్డి
5.శ్రీ వెంకట్ తోటకూర
6.శ్రీ లక్ష్మణ్ కోట
7.శ్రీ చెంగల్వరాయం బొప్పన
నూతన నాయకత్వం ఈ క్రింది కొత్త ఇంచార్జిలను కూడా నియామకం చేసారు.
రాజేష్ తోలేటి: In-charge literary
విజయ్ బెలిదే: In-charge Fundraising
సునీల్ ఆలపాటి: In-charge Fundraising
ప్రశాంతి తిరునగరి: In-charge Cultural
శ్రీరామ్ సూరపనేని: In-charge TCC
సుభాష్ లోకసాని: – In-charge TCC
రవి దేవనబోయిన: In-charge IT
మురళి కోట: In-charge IT
సింధూర చెరకు: In-charge Sports
అనిల్ ఏనుగు: In-charge Sports
TAL వ్యవస్థాపక సభ్యులు, సలహాదారులు శ్రీధర్ వనం, రాములు దాసోజు నూతన ధర్మకర్తల మండలికి అభినందనలు తెలిపారు. నూతన నాయకత్వానికి సభ్యులందరూ తమ సహకారాన్ని, మద్దతును అందించాలని పిలుపునిచ్చారు. సంస్థ లక్ష్యాలను సాధించేందుకు, TAL ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలని శ్రీ శ్రీధర్ వనం కోరారు.
నూతన ధర్మకర్తల మండలి తమపై విశ్వాసం ఉంచి, తెలుగు సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన TAL సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, శ్రేయోభిలాషులతో కలిసి పనిచేస్తూ, తెలుగు సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం , యునైటెడ్ కింగ్డమ్లోని తెలుగు సమాజాన్ని మరింత బలోపేతం చేయడం కోసం TAL చేపడుతున్న కార్యక్రమాలను కొనసాగిస్తామని నూతన మండలి తన నిబద్ధతను వ్యక్తం చేసింది.
ఈ వార్షిక సర్వసభ్య సమావేశం TAL ప్రయాణంలో ఒక అధ్యాయానికి ముగింపు పలుకుతూ, నూతన నాయకత్వంలో మరో అధ్యాయానికి నాంది పలికింది. సంస్థ అభివృద్ధిని కొనసాగిస్తూ, తెలుగు సమాజానికి మరింత సేవ చేయాలనే ఉమ్మడి సంకల్పంతో నూతన ధర్మకర్తల మండలి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.









