విజయ్‌కు కొత్త ఇమేజ్ లైన్ సిద్ధమైందా?
హీరోగా కెరీర్లో ఒక దశకు చేరుకున్న తర్వాత కొత్త తరహా పాత్రలను ఎంచుకోవడం ఏ నటుడికైనా కీలకమే. ముఖ్యంగా వరుస సక్సెస్‌లు దక్కనప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అలాంటి దశలోనే ఉన్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన రణబాలితో ఆడియన్స్ ముందుకు రాబోతున్న విజయ్, ఈసారి భిన్నమైన నేపథ్యం, క్యారెక్టర్ లోని డెప్త్ తో తన యాక్టింగ్ లో మరో యాంగిల్ ను చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇవ్వబోతోందన్న ఆసక్తి నెలకొంది.
రణబాలి విషయంలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ముందున్న మెయిన్ ఛాలెంజ్ విజయ్ను కొత్తగా చూపించడమే. ఒక పాత్రకు తగ్గట్టుగా హీరో బాడీ లాంగ్వేజ్, సీన్స్, ఎమోషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను మలచడంలో డైరెక్టర్ పనితనం స్పష్టమవుతుంది. ట్రైలర్లో కనిపించిన విజయ్ లుక్, క్యారెక్టర్ లోని డెప్త్ ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ లక్షణాలన్నీ కథలో ఎంత బలంగా ఇమిడాయి? ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అనే ప్రశ్నలకు సినిమా రిలీజ్ అయ్యాకే సమాధానం దొరుకుతుంది. కేవలం కొత్త లుక్‌తో కాకుండా, బలమైన కథతో విజయ్ను మరో స్థాయికి తీసుకెళ్లడం రాహుల్‌కు అసలైన పరీక్ష.
ఇక రణబాలి తర్వాత విజయ్ చేస్తున్న రౌడీ జనార్ధన కూడా సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ప్రాజెక్ట్ కావడంతో ఆయన సినిమాల ఎంపికలపై చర్చ మొదలైంది. వరుసగా భిన్నమైన పాత్రలు చేస్తూ నటుడిగా తన పరిధిని విస్తరించుకోవడం విజయ్‌కు ఎంతవరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రణబాలి బలమైన విజయాన్ని అందుకుంటే తదుపరి సినిమాపై అంచనాలు పెరగడమే కాకుండా, విజయ్ మార్కెట్‌కు కూడా కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రెండు సినిమాలూ ఆయన ఇమేజ్ను మార్చే మైలురాళ్లుగా నిలుస్తాయా లేదా అనేది కథాబలం, యాక్టింగ్, ఆడియన్స్ ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది.








