రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘లెనిన్’.. బాక్సాఫీస్ వద్ద అఖిల్ అక్కినేని సంచలనం
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే ‘లెనిన్’ రికార్డుల్ని సృష్టించడం ఆరంభమైంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘లెనిన్’ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు అందించిన కథ, కథనం అన్నీ కూడా సినిమాకి ప్రధాన బలం. ఇక ఇందులో ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ అద్భుతమైన పర్ఫామెన్స్‌ను ప్రదర్శించారు. లెనిన్ పాత్రలో అఖిల్ నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్లో మెప్పించాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, ఈశ్వరీ రావు, ప్రమోద్ అందరూ అద్భుతం చేశారు.
ఇక ఈ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం, నేపథ్యం సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. లియోన్ బ్రిట్టో కెమెరావర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాని నిలబెట్టాయి. అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరడంతో అక్కినేని అభిమానులంతా సంతోషిస్తున్నారు.








