సిలికానాంధ్ర రజతోత్సవాలు…‘లయామృతవర్షిణి’ కార్యక్రమం
మాతృభాష, తెలుగు సంస్కృతి, కలలు మరియు పరంపర పరిరక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్న ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘సిలికానాంధ్ర’ తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 2026, ఆగస్టు 1వ తేదీన కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ‘ఓక్లాండ్ ఎరీనా’వేదికగా ఈ సాంస్కృతిక సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా నేడు ‘లయామృతవర్షిణి’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మీరు ఇంకా నమోదు చేసుకోకపోతే, ఒక అద్భుత ఘట్టాన్ని కోల్పోయినట్లేనని సిలికానాంధ్ర నిర్వాహకులు పేర్కొంటున్నారు.
![]()
![]()








