సల్మాన్ సినిమాలో కార్తీక్ ఆర్యన్? ఎంత నిజముంది?
బాలీవుడ్లో స్టార్ హీరోలు ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నా, రిజెక్ట్ చేశారన్నా సోషల్ మీడియాలో వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి డిస్కషన్స్ లో కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan) పేరు కూడా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా, సల్మాన్ ఖాన్(salmna khan) హీరోగా వంశీ పైడిపల్లి(vamshi paidipally) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో కార్తీక్ ఆర్యన్‌కు ఒక కీలక కామియో ఆఫర్ వచ్చిందని, అయితే డేట్స్ ఇష్యూ కారణంగా ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.
అయితే ఈ ప్రచారానికి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కార్తీక్ ఆర్యన్ టీమ్ నుంచి గానీ, చిత్ర యూనిట్ నుంచి గానీ ఈ అంశంపై ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ న్యూస్ కు ఆధారాలు కూడా కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక రూమర్‌గా మాత్రమే పరిగణించాల్సిన పరిస్థితి ఉంది.
ఇక సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు(Dil raju) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండటంతో, ఇలాంటి ఊహాగానాలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో వచ్చిన ప్రచారం నిజమా కాదా అన్నది ఫ్యూచర్ లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








