బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దీ సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) శుక్రవారం తెల్లవారుజామున 12.51 గంటలకు హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూలై 26న హనుమకొండలో తీవ్ర గుండెపోటుకు గురైన తర్వాత సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి (Yashoda Hospital)లో చేరారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస తుదిశ్వాస విడిచారని యశోద అధికారులు ప్రకటించారు.
2019 ఎన్నికలలో గెలిచి నర్సంపేట (Narsampet) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత్ రాష్ట్ర సమితికి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు ఛైర్మన్ (Chairman)గా కూడా పనిచేశారు. తెలంగాణ సాధనకు అండగా నిలిచిన ఆదర్శ నాయకుడైన సుదర్శన్ రెడ్డి, 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) తరఫున జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2004లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ తర్వాత 2002లో రాష్ట్ర పార్టీ కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ (Warangal) జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.








