విద్యాశాఖకు నేనెందుకు రాజీనామా చేయాలి ? : సీఎం రేవంత్ రెడ్డి
ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొట్ట మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చారు
సమాజంలో విద్య సమూల మార్పులు తీసుకువచ్చేందుకు పునాదిగా పనిచేస్తుందని నెహ్రూ నమ్మారు.
దేశంలో కరువును పారద్రోలేందుకు ఇరిగేషన్ అవసరాన్ని నెహ్రూ గుర్తించారు
అందుకే సాగునీటి ప్రాజెక్టులను ఆయన ఆధునిక దేవాలయాలుగా వర్ణించారు
ఆనాటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో ఈనాడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేయగలిగింది
హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలు తెచ్చిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసు
స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి 2104 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు 50 లక్షల కోట్లు
2014 నుంచి 2026 వరకు ప్రధాని మోడీ చేసిన అప్పు 151 లక్షల కోట్లు
ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు 201 లక్షల కోట్లు
కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారు
ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్ ను సార్వభౌమత్వ దేశంగా మార్చిన వారి గురించి మాత్రం తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
నాడు పీవీ తీసుకొచ్చిన గురుకులాలే నేటి నవోదయ విద్యాలయాలకు స్ఫూర్తి
ఆనాటి నాయకులు తెచ్చిన సంస్కరణలతో విద్య అందింది.. ఆకలి తీరింది
కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు
ప్రతీ పేదవాడికి విద్యను అందించడం మాత్రమే సరిపోదు… వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి
నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలి
ఆ దిశగా తెలంగాణను తీర్చి దిద్దే ప్రతినిధులు మీరే..
వెనకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదు
విద్య లేకపోవడమే అసలైన వెనకబాటుతనం
ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం
ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 8 వేలు ఖర్చు చేస్తోంది
ప్రైవేటు స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు దాదాపు 50 వేలు.
మరి తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్స్ కు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి
ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య లక్ష మంది అదనంగాచేరారు
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారు
మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా చేయాలా
నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా?
టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా?
ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా?
విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా?
ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా?
విద్య నైపుణ్యం కాదు.. విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
ఇంగ్లీష్ ఒక్కటే ముఖ్యమనుకుంటుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది?
25 ఏళ్లు అమెరికా వైపు చూశాం… ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై
ఆ దేశాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
12 వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన ఉండాలి
విద్యార్థుల్లో ఆ అవగాహన పెంపొందిచాల్సింది ఉపాధ్యాయులే
ఈ వేదికగా ఉపాధ్యాయులకు నేను ఒకటే సూచన చేస్తున్నా
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది
ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు.. విద్యార్థుల సమస్యలపై కొట్లాడండి
ప్రపంచ దేశాలు మనవైపు చేసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం
ఒక ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్ ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి
దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేయండి
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచన చేయండి
వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక రూపొందించండి
ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి
విద్యతోపాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారు
2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయి.
ఉపాధ్యాయులు మీ అనుభవాన్ని విద్యార్థులకు పంచాలన్నదే మా ఆలోచన
ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఏర్పాటు అందిస్తున్నాం
మానవ సంబంధాలను పునరుద్ధరించాలనే ప్రయత్నం చేస్తున్నాం
పిల్లలు తల్లిదండ్రులకు స్ట్రెస్ బస్టర్స్…
అందుకే డే స్కాలర్ విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నాం
సమాజంలో మానవ సంబంధాలు విశ్చిన్నం అయితే ఏ కుటుంబం, ఏ దేశం నిలబడదు.
తల్లిదండ్రుల కంటే పిల్లలు ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ సమయం ఉంటారు.
తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయులకు అంతే బాధ్యత ఉంది
విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్ లతో సమానంగా ప్రతీ ఏటా టీచర్స్ ను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిద్దాం
నాణ్యమైన విద్యను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించేలా ప్రణాళికలు రూపొందించాలి.
ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడంలేదు
నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యతతో పని చేసుకుంటూ వెళ్తున్నా..
నా సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి నుంచే దీక్ష తీసుకుని బయలుదేరండి..








