హీరోయిన్ అవుతానంటే అమ్మ వాట్సాప్ లో బ్లాక్ చేసింది
హీరోయిన్ గా ఎదగాలన్న తన నిర్ణయం వెనుక ఉన్న కుటుంబ విభేదాలను భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri borse) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న తన కోరికను ఇంట్లో వాళ్లకు చెప్పినప్పుడు ఎవరూ తనకు మద్దతు ఇవ్వలేదని ఆమె వెల్లడించారు. మొదట తల్లితో మాట్లాడగా ఆమె ఒప్పుకోలేదని, ఆ తర్వాత తండ్రిని అడగ్గా, మీ అమ్మకు ఇష్టం లేదని సమాధానం వచ్చిందని చెప్పారు. కనీసం తన సోదరి అయినా ప్రోత్సహిస్తుందనుకుంటే, ఆమె కూడా వ్యతిరేకించడంతో ఫ్యామిలీ అంతా తన డెసిషన్‌కు వ్యతిరేకంగా నిలిచిందని భాగ్యశ్రీ గుర్తుచేసుకున్నారు.
ఆ పరిస్థితుల్లో కూడా తన కలను వదులుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదని ఆమె తెలిపారు. నటిగా కెరీర్‌ను కొనసాగించాలన్న తన పట్టుదల కారణంగా ఫ్యామిలీతో దూరం పెరిగిందని చెప్పారు. ఒక దశలో తన తల్లి వాట్సాప్‌లో తనను బ్లాక్ చేసి, దాదాపు ఆరు నెలల పాటు మాట్లాడలేదని ఆమె వెల్లడించారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ తన లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ స్టేజెస్ లో ఒకటిగా మిగిలిపోయిందని పేర్కొన్నారు.
అయితే ఆ కఠిన పరిస్థితుల్లో కూడా తనను ముందుకు నడిపించింది ఒక్క నమ్మకమేనని భాగ్యశ్రీ అన్నారు. ఒక రోజు తన సక్సెస్ ను చూసి తన తల్లి గర్వపడుతుందనే విశ్వాసమే తనకు ధైర్యాన్నిచ్చిందని చెప్పారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా టార్గెట్ ను వదలకుండా ముందుకు సాగిన తన జర్నీ ఎంతో కఠినమైనదైనా, అదే తనను మరింత బలంగా మార్చిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.








