NBK-Koratala: కొరటాలతో బాలయ్య సినిమా?
టాలీవుడ్లో ఇటీవలి కాలంలో వినిపించిన అత్యంత ఆసక్తికర కాంబినేషన్లలో కొరటాల శివ(koratala siva)- నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రాజెక్ట్ ఒకటి. గతంలో సింహా(Simha) సినిమాకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివకు బాలయ్య ఇమేజ్ను బాగా అర్థం చేసుకున్న దర్శకుడిగా పేరుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కాంబో కోసం కొరటాల ఒక పవర్ఫుల్ కమర్షియల్ డ్రామాను సిద్ధం చేశారని తెలుస్తోంది. మొదటి నెరేషన్‌లోనే బాలకృష్ణ ఈ కథపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో పాటు సమాజానికి బలమైన సందేశాన్ని అందించేలా ఈ సినిమా ఉండబోతోందని టాక్.
ఈ సినిమాను సంక్రాంతి 2027కి రిలీజ్ చేయాలన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ, తాజా అప్డేట్స్ ప్రకారం ఆ ప్లాన్ మారే అవకాశం ఉంది. షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసి, సమ్మర్ 2027లో విడుదల చేయాలనే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ టచ్‌లతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. బాలయ్య కోసం ప్రత్యేకంగా కొత్త లుక్‌ను డిజైన్ చేస్తున్నారని, ఇది అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుందని చెబుతున్నారు.
ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri), సుధాకర్ మిక్కిలినేని(Sudhakar Mikkilineni) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మే నెలలో ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముండగా, ఆ అనౌన్స్మెంట్తోనే ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ రానుంది. మొత్తానికి, బాలయ్య- కొరటాల కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.








