Jana Nayagan: జన నాయగన్ వచ్చేదప్పుడేనా?
తమిళ స్టార్ హీరో విజయ్(vijay) నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా జన నాయగన్(jana nayagan) రిలీజ్ డేట్ పై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ ప్రక్రియ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే, ఏప్రిల్ 24, 2026న సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ పరిణామాలు సినిమాపై ప్రభావం చూపకుండా ముందుగానే రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఏప్రిల్ 24 రిలీజ్ డేట్ కు ఎన్నో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం ఈ సినిమాకు ప్లస్‌గా మారనుంది. అలాగే మే డే సెలవులు దగ్గర్లో ఉండటం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా కలిసొచ్చే అవకాశముంది. ఒకవేళ ఏప్రిల్ 30న విడుదల చేస్తే, కరా(kara), పెద్ది(peddi) లాంటి భారీ సినిమాలతో పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద గరిష్ట వసూళ్ల కోసం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అసలు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్నా, సెన్సార్ సంబంధిత సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు రివైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ కోసం ప్రొడక్షన్ టీమ్ వేచి చూస్తోంది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో ఈ సినిమా ఆయన కెరీర్లో కీలక ప్రాజెక్ట్‌గా మారింది. ఈ వారంలో సర్టిఫికేషన్ పూర్తైన వెంటనే అఫీషియల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








