Jana Nayagan: మళ్లీ ఆగిపోయిన సెన్సార్.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్(Vijay) కెరీర్లో కీలక చిత్రంగా భావిస్తున్న జన నాయగన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్ ఆఖరి మూవీగా జన నాయగన్(Jana Nayagan) భావించబడుతుండటంతో మొదటి నుంచే అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్‌కు ముందు వరుస అడ్డంకులు ఎదురవుతుండటంతో ప్రాజెక్ట్ చుట్టూ అనిశ్చితి నెలకొంది. హెచ్. వినోద్(H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదట జనవరిలో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. తాజాగా సెన్సార్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న టైమ్ లో మరో ఆటంకం తలెత్తినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
సెన్సార్ రివ్యూ కమిటీలో ఉన్న ఒక సభ్యుడు అనారోగ్యానికి గురికావడంతో సెన్సార్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల సినిమా రిలీజ్ డేట్ పై మళ్లీ సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ సినిమా ఆయన సినీ కెరీర్‌కు ముగింపు చిత్రంగా నిలిచే అవకాశముండటంతో అభిమానులు దీనిని ప్రత్యేకంగా చూడాలని ఎదురుచూస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Producions) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(pooja hegde), మమిత బైజు(mamitha byju) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగులో జన నాయకుడు అనే టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి








