Durandhar2: దురంధర్2 కు శంకర్ రివ్యూ
ఇండియన్ సినిమా ప్రస్తుత ట్రెండ్‌లో భారీ చర్చనీయాంశంగా మారిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్2(Durandhar2) బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్‌ను కొనసాగిస్తోంది. యంగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్(Adityadhar) తెరకెక్కించిన ఈ సినిమా, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి రూపొంది, రిలీజైన తొలి రోజునే అంచనాలను అందుకుని స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను సాధించింది. హై ఓల్టేజ్ యాక్షన్, టెక్నికల్ గ్రాండియర్, రియలిస్టిక్ నేరేషన్ కలగలిపిన ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా సినీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.
రీసెంట్ గా ఈ సినిమాను చూసిన ప్రముఖ డైరెక్టర్ శంకర్(Shankar) తన రెస్పాన్స్ తో సినిమాపై మరింత హైప్ ను పెంచారు. నిజ సంఘటనల ప్రేరణతో కల్పిత పాత్రలను మిళితం చేస్తూ ఆదిత్య ధర్ కథను నడిపిన తీరు ప్రశంసనీయమని శంకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ అనిపించకుండా సీన్స్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుందని చెప్పారు. స్క్రీన్ ప్లే పేసింగ్, విజువల్ ట్రీట్మెంట్ సినిమాను మరింత ఎంగేజింగ్‌గా నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ దేవ్(Sasvath dev) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాన్ని అందించిందని శంకర్ అభిప్రాయపడ్డారు. రణ్వీర్ సింగ్(Ranveer Singh) స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే కీలక పాత్రలో కనిపించిన ఆర్ మాధవన్(R Madhavan) నటన సినిమాకు మరో హైలైట్‌గా నిలిచాయని పేర్కొన్నారు. సరైన నటీనటుల ఎంపికతో సినిమా సహజత్వం పెరిగిందని, ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశముందని ఆయన విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి








