Durandhar2: దురంధర్ ప్రీ రిలీజ్ క్రేజ్ రేంజ్ వేరే..!
ఒక సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే.. సెకండ్ పార్ట్ పై ఉండే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. గతంలో బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, వార్(War) వంటి సినిమాలకు ఇదే రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు దురంధర్ వంతు వచ్చింది. కథలో బలం ఉంటే.. ఒక సినిమాలో చెప్పలేం అని.. రెండు సినిమాలు ప్లాన్ చేస్తూ.. క్రేజ్ ను పీక్స్ కు తీసుకుని వెళ్తున్న దర్శక నిర్మాతలు.. ఇప్పుడు దురంధర్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు పార్ట్ లు రిలీజ్ ప్లాన్ చేసారు. అంచనాలు లేకుండా వచ్చి ఫస్ట్ పార్ట్ షేక్ చేసింది.
నార్త్ టూ సౌత్.. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు రెండవ పార్ట్ కు క్రేజ్ మొదలైంది. ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా, ది రివేంజ్.. ట్యాగ్ లైన్ తో వస్తున్న సెకండ్ పార్ట్ కు.. గత వారం ట్రైలర్(Trailer) రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ భారీగా పెరిగిన మాట వాస్తవం.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ప్రీమియర్ షోస్ కి లక్షల్లో టికెట్ లు తెగుతున్నాయి. పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువైన ఈ సినిమాకు.. మార్చ్ 18కి టికెట్ లు విక్రయిస్తున్నారు. లేటెస్ట్ గా మనకు అందిన లెక్కల ప్రకారం చూస్తే.. 24 గంటల్లోనే, ఒక్క బుక్ మై షో(Book My show)లో 87 వేల టిక్కెట్లు అమ్మేసారు.
మార్చ్ 9కి.. ఈ కౌంట్ ఇంకా పెరిగి.. 1.5 లక్షలకు, ఆ తర్వాత 2 లక్షలకు పైగా వెళ్ళింది. సాక్ నిల్క్ విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే.. ఓవరాల్ గా.. ఇండియా(Pan India) వైడ్ గా.. 2.06 లక్షల టిక్కెట్లు అమ్మేసారట. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్(Advance Booking) తోనే 12.29 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసాడు దురంధర్. హిందీ వెర్షన్ నుంచే కాకుండా మన సౌత్ నుంచి కూడా వసూళ్లు అదే రేంజ్ లో ఉన్నాయి. ప్రివ్యూ షోల కలెక్షన్స్ తమిళనాడులో రూ. 10 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ఇలా ప్రీమియర్ షోస్ ద్వారా భారీ వసూళ్లు సాధించిన సినిమాగా.. దురంధర్ ది రివేంజ్ రికార్డులు క్రియేట్ చేసింది. దీని కంటే ముందు స్త్రీ 2 పది కోట్లు వసూలు చేసింది. ఇంకా 9 రోజులు ఉంది కాబట్టి ఈ లెక్కలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి








