జ్యోతిక సూచనలు.. ‘విశ్వనాథ్ & సన్స్’కు ప్లస్ అవుతాయా?
సూర్య(Suriya) హీరోగా వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వనాథ్ & సన్స్(Vishwanath & Sons) సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ సినిమాలో మమితా బైజు(Mamitha Byju) హీరోయిన్గా నటిస్తుండగా, కథ రూపుదిద్దుకునే దశలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించి ప్రముఖ నటి జ్యోతిక(Jyothika) ఇచ్చిన సూచనలు డైరెక్టర్‌పై మంచి ప్రభావం చూపినట్లు వెంకీ అట్లూరి వెల్లడించడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా కథలోని ఎమోషన్స్ పై ఆమె రెస్పాండ్ అయిన తీరు టీమ్‌కు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విశ్వనాథ్ & సన్స్ సినిమాకు సంబంధించిన కీలక స్టోరీ డిస్కషన్స్ జ్యోతిక కూడా భాగమయ్యారని వెంకీ అట్లూరి చెప్పారు. కథను పూర్తిగా విన్న ఆమె ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌ను ఎంతో మెచ్చుకోవడంతో పాటు, కొన్ని విలువైన సూచనలు కూడా చేశారట. సినిమా స్క్రిప్ట్‌ను పలువురికి వినిపించినప్పటికీ, జ్యోతిక ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాత్రం ప్రత్యేకంగా ఉపయోగపడిందని వెంకీ పేర్కొన్నారు. అయితే ఆమె సూచించిన మార్పులు ఏమిటనే విషయాన్ని మాత్రం సినిమా రిలీజైన తర్వాతే వెల్లడిస్తానని చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సినిమా నిర్మాణంలో స్టార్ కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కొత్త విషయం కాకపోయినా, కథను మరింత బలంగా తీర్చిదిద్దేలా అలాంటి సూచనలు ఉపయోగపడితే రిజల్ట్ పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జ్యోతిక సూచనలు కూడా విశ్వనాథ్ & సన్స్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అయ్యాయో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. నాగవంశీ(naga vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.








