వాయిదాలను వాడుకోవాలని చూస్తున్న బాలయ్య
టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హవా కొనసాగుతోంది. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. బాలయ్య-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. బాలయ్య కెరీర్లో ఈ సినిమా 109వ మూవీగా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ను కుదిరినంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ అంశాన్ని వాడుకోవాలని NBK109 మేకర్స్ చూస్తున్నారు. జూన్ వరకు ఎప్పుడు ఏ సినిమా వస్తుందో ఎవరికీ అర్థం కాని సిట్యుయేషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొంది.
పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయితే ఏప్రిల్ తర్వాత వచ్చే పెద్ద సినిమా బాలయ్యదే కానుంది. వాస్తవానికి ముందుగా NBK109ను దసరాకు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమాలు వాయిదా పడుతున్నాయని వస్తున్న వార్తలు విన్న నిర్మాతలు ఆ డేట్స్ లో ఒక దాన్నైనా వాడుకుని సోలో రిలీజ్ తో మంచి కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారట.













