AK47: ఆదర్శకుటుంబం లో యాక్షన్ కూడా!
టాలీవుడ్లో ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా షూటింగ్ కొనసాగిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా ఆదర్శకుటుంబం(Adarsha kutumbam) గురించి చర్చ జరుగుతోంది. వెంకటేష్(venkatesh) హీరోగా శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుఉతుంది. ప్లాన్ ప్రకారం ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేసే దిశగా యూనిట్ పనిచేస్తోంది. ప్రస్తుతం సినిమా విడుదలపై అధికారిక ప్రకటన లేకపోయినా అక్టోబర్ 2 తేదీని టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రమోషనల్ కార్యక్రమాలను మాత్రం సమ్మర్ నుంచి మొదలుపెట్టాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి
టైటిల్ చూసినప్పుడు ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించినా, కథలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ఫస్టాఫ్ సరదా టోన్‌లో సాగుతూ నువ్వు నాకు నచ్చావు(Nuvvu naku nachavu), మల్లీశ్వరి(malleswari) తరహా వినోదాన్ని గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఇంటర్వెల్ సమయానికి టైమ్ కు కథలో భారీ మలుపు వచ్చి అక్కడి నుంచి టోన్ పూర్తిగా మారుతుందట. సెకండాఫ్ అతడు(Athadu) తరహా స్టైల్‌తో సీరియస్ నేరేషన్లోకి వెళ్లి డైరెక్టర్ తన ప్రత్యేకమైన ట్రీట్మెంట్ను చూపిస్తారని సమాచారం.
రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం(Guntur karam)లో ఎదురైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత జాగ్రత్తగా కథను తీర్చిదిద్దినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫలితం త్రివిక్రమ్‌కు కీలకంగా మారింది. ఎందుకంటే ఆయన తదుపరి ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరగాలంటే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి








