Venkatesh: క్రేజీ సీక్వెల్ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో వెంకీ?
గతేడాది సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) మూవీ భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పటికీ విక్టరీ వెంకటేశ్(Venkatesh), ఎప్పటిలాగే ప్రాజెక్ట్ ఎంపికలో తొందరపడకుండా ముందుకు సాగుతున్నారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటించిన మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad garu) సినిమాలో క్యామియో పాత్రలో కనిపించిన వెంకటేశ్, వెంకీ గౌడ(Venky Gowda)గా తన యాక్టింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam)లో నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయానికొస్తే దృశ్యం3(Drishyam3) తెలుగు రీమేక్ విషయంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదట వెంకటేశ్‌తోనే ఈ సినిమాను చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఇటీవలి కాలంలో రీమేక్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రాకపోవడం నిర్మాతలను ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా మలయాళ వెర్షన్ ఏప్రిల్ 1న రిలీజై త్వరలోనే ఓటీటీలోకి రానుండటంతో, తెలుగు వెర్షన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు(MSG) సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్న అనిల్, వెంకటేశ్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. జూన్ లేదా జూలైలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. సంక్రాంతి 2027 రిలీజ్‌ను లక్ష్యంగా పెట్టుకుని ప్లానింగ్ జరుగుతోంది. ఇక దృశ్యం 3 విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి








