ఓటీటీలో ది ప్యారడైజ్‌కు కొత్త టచ్.. నాని కీలక నిర్ణయం!
నేచురల్ స్టార్ నాని(nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్(the paradise) థియేటర్లలో మిక్డ్స్ రెస్పాన్స్ ను అందుకుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై కథనం, ఎడిటింగ్, కొన్ని సీన్స్ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌పై మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ ను లెక్కలోకి తీసుకుని ఓటీటీ వెర్షన్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు నాని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఆడియన్స్ నుంచి వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను తగ్గించేలా ఓటీటీ కట్లో మార్పులు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. థియేట్రికల్ వెర్షన్లో కనిపించని ఒక పాటను డిజిటల్ వెర్షన్లో చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇప్పటికే సినిమాలో ఉన్న సాంగ్స్ కు సంబంధించిన ఎక్స్ట్రా సీన్స్ ను కూడా జోడించే అవకాశం ఉందని సమాచారం. ఈ మార్పులతో సినిమాకు కొత్త అనుభూతిని అందించాలన్నది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది.
థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ది ప్యారడైజ్, ఓటీటీలోనైనా ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్తగా రూపొందించే వెర్షన్‌కు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.








