భగవంత్ కేసరి ప్రీక్వెల్పై మళ్లీ చర్చ
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ గా చోటు సంపాదించుకున్న సినిమాల్లో భగవంత్ కేసరి(bhagavanth kesari) ఒకటి. అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023లో రిలీజై ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకుంది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగులు, నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో ఆయన చూపించిన నటన సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘బనావో బేటీ కో షేర్’ అనే మెసేజ్ ఆడియన్స్ ను ఎంతగానో ఆలోచింపజేసింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం. తాజాగా ఈ సినిమా ప్రీక్వెల్‌కు సంబంధించిన డిస్కషన్స్ మరోసారి తెరపైకి వస్తున్నాయి.
గతంలో అనిల్ రావిపూడి స్వయంగా ఈ ప్రాజెక్ట్‌పై తన ఆసక్తిని వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ కంటే ప్రీక్వెల్ చేస్తే బాగుంటుందని తమ టీమ్ భావించినట్లు తెలిపారు. భగవంత్ కేసరి పోలీసు కాకముందు ఆయన జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే అంశంతో కథను రూపొందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, అప్పట్లో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఫ్యూచర్ లో ఛాన్స్ వస్తే ప్రీక్వెల్‌ను తెరకెక్కించాలని ఉందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతం వెంకటేష్(venkatesh), నందమూరి కల్యాణ్ రామ్(nandamuri kalyanram)లతో సంక్రాంతిని టార్గెట్ గా చేసుకుని అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల(january 12 vidudala) అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో దాదా(dada) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ బాలయ్యతో ఉండబోతుందా? భగవంత్ కేసరి ప్రీక్వెల్‌కు ఆయన మళ్లీ శ్రీకారం చుడతారా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.








