ధృవతో ప్రూవ్ చేసుకున్న సత్తా.. సూరికి మళ్లీ అలాంటి ఛాన్స్ వస్తుందా?
ఒక సినిమా సక్సెస్ తో స్టార్ డైరెక్టర్‌గా ఎదగడం ఎంత సులభమో.. ఒక భారీ ఫ్లాపు తర్వాత అదే స్థాయి అవకాశాలను అందుకోవడం అంత కష్టం. డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender reddy) కెరీర్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కిక్(Kick), రేసుగుర్రం(Rece gurram) వంటి సక్సెస్‌లతో తనదైన మాస్ మేకింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. రామ్ చరణ్(ram charan)తో చేసిన ధృవ(Dhruva)తోనూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. రీమేక్ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలిచి సక్సెస్ ను అందుకున్నారు. కానీ ఆ తర్వాతి జర్నీలో సైరా నరసింహారెడ్డి(Syera narasimha reddy), ఏజెంట్(Agent) సినిమాలు ఆయన కెరీర్‌పై భిన్నమైన ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా ఏజెంట్ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.
ఇక్కడ అసలు ప్రశ్న ఆయనలో టాలెంట్ తగ్గిందనేది కాదు.. ఆ టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఎంత త్వరగా వస్తుందనేదే. సినీ ఇండస్ట్రీలో గత విజయాలు గుర్తింపును తెచ్చిపెట్టినా, కొత్త ప్రాజెక్టుల విషయంలో తాజా ఫలితాలు, కథపై నమ్మకం, బడ్జెట్ వంటి అంశాలు కీలకంగా మారుతుంటాయి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్.. ఇప్పుడు తన నెక్ట్స్ స్టెప్ ను ఆచితూచి వేయాల్సిన పరిస్థితి రావడం కెరీర్లో ఎదురయ్యే మార్పులకు నిదర్శనంగా చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్(pawan kalyan)తో చేసే సినిమా సురేందర్ రెడ్డికి ఆ ఛాన్స్ ఇస్తుందనే డిస్కషన్ ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో మరో స్టార్ హీరోతో భారీ సినిమా చేయడమా, లేక స్ట్రాంగ్ స్టోరీతో తన సత్తాను మళ్లీ చాటడమా అన్నది కీలకంగా మారింది. ధృవతో ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ గా ఆయనపై అంచనాలు ఇంకా ఉన్నాయి. అయితే ఆ అంచనాలను సక్సెస్ గా మార్చేందుకు సూరికి ఎలాంటి కథ, ఎలాంటి కాంబినేషన్ కలిసి వస్తాయన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.








