జైలర్2తో నెల్సన్‌కు అసలైన పరీక్ష!
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న జైలర్2(jiler2)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ తో బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌కు ఈ సీక్వెల్ ఇప్పుడు కీలకంగా మారింది. రజనీకాంత్ ఇమేజ్‌కు తనదైన కామెడీ, యాక్షన్‌ను జోడించి ఆడియన్స్ ను మెప్పించిన నెల్సన్(nelson).. సీక్వెల్ తోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాల్సి ఉంది. అయితే మొదటి సినిమాకు వచ్చిన సక్సెస్ ను మించి సీక్వెల్‌పై అంచనాలు ఉండటంతో ఆయనపై ప్రెజర్ కూడా పెరుగుతోంది.
ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ(coolie) విషయంలో ఎదురైన పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ కు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించినప్పటికీ, బడ్జెట్, బిజినెస్‌తో పోల్చి చూసినప్పుడు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో సినిమా అనే ప్రచారానికి సంబంధించి అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో జైలర్2(jailer2) రిజల్ట్ నెల్సన్ కెరీర్‌కు మరో కీలక మైలురాయిగా నిలవనుంది. భారీ అంచనాలను అందుకోవడంతో పాటు, ఆడియనస్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. అయితే ఒక సినిమా రిజల్ట్ తో డైరెక్టర్ టాలెంట్ ను పూర్తిగా అంచనా వేయలేం. మరి జైలర్2తో నెల్సన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారా? లేక అంచనాల భారమే సినిమాకు సవాలుగా మారుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.








