మహేష్ బాబు నెక్ట్స్ లిస్ట్ లో ఛాన్స్ అందుకునే డైరెక్టర్ ఎవరు?
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే అంశం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి(varanasi) సినిమాతో బిజీగా ఉన్న మహేష్, ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎలాంటి కథను ఎంచుకుంటారన్న దానిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, సుకుమార్(sukumar) కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతానికి వీరిద్దరి కలయికపై వస్తున్న కథనాలకు బలమైన ఆధారాలు లేవనే డిస్కషన్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) పేరు బాగా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అదే సమయంలో ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో మహేష్ సినిమా చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో మహేష్ తన నెక్ట్స్ మూవీకి ఎవరిని డైరెక్టర్ గా తదుపరి సెలెక్ట్ చేసుకుంటారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి బయటకు వస్తే కానీ మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు ఎన్ని వార్తలొచ్చినా అవన్నీ కేవలం రూమర్లుగానే అనుకోవాలి.








