Axios: అమెరికాపై ఉత్తర కొరియా సైబర్ స్ట్రైక్.. ‘యాక్సియోస్’ హ్యాకింగ్‌తో కంపెనీల విలవిల!
అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా సైబర్ నేరగాళ్లు భారీ షాక్ ఇచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు చెందిన వేలాది కంపెనీలు నిత్యం ఉపయోగించే కీలకమైన సాఫ్ట్‌వేర్‌ను హ్యాకర్లు (Axios) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ అనూహ్య దాడితో అప్రమత్తమైన అమెరికా టెక్ వర్గాలు, ఈ భారీ నష్టం నుంచి కంపెనీలు కోలుకోవడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
అమెరికాలోని దాదాపు అన్ని సంస్థలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్యాకేజీ అయిన ‘యాక్సియోస్’ (Axios)ను విరివిగా ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించే ఓ ప్రధాన డెవలపర్ ఖాతాలోకి ఉత్తర కొరియా హ్యాకర్లు అక్రమంగా చొరబడ్డారు. ఆ అకౌంట్ యాక్సెస్ ద్వారా వేలాది అమెరికన్ కంపెనీలకు మాల్వేర్తో కూడిన నకిలీ అప్డేట్లను (Fake Updates) పంపించారు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించిన సదరు సాఫ్ట్వేర్ డెవలపర్, తీవ్రంగా శ్రమించి తన ఖాతాను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకునే వరకు ఈ మాల్వేర్ వ్యాప్తి యథేచ్ఛగా కొనసాగినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి
నష్టం అంచనాకు నెలల సమయం
ఈ సైబర్ దాడి (Axios) ప్రభావం అమెరికా వ్యాపార రంగంపై తీవ్రంగా పడిందని, కంపెనీలు తమ సిస్టమ్స్‌ను ప్రక్షాళన చేసుకుని, అసలు ఎంత డేటా చోరీకి గురైందో అంచనా వేసి మునుపటి స్థితికి చేరుకోవడానికి చాలా నెలల సమయం పడుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
క్షిపణుల కోసమే ఈ దోపిడీ
ఈ భారీ సాఫ్ట్వేర్ హ్యాకింగ్ (Axios) వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థలు నిర్ధారించాయి. నియంత కిమ్ జోంగ్ ఉన్ దేశానికి చెందిన హ్యాకర్లు ఇలాంటి దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాంకులు, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలపై దాడులు చేసి బిలియన్ల కొద్దీ డాలర్లను కొల్లగొట్టారు. ఇలా సైబర్ నేరాల (Axios) ద్వారా దోచుకున్న సొమ్మును కిమ్ యంత్రాంగం తమ దేశ అణ్వాయుధ, క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాలకు (Missile Programs) బరాబర్ వినియోగిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా దాడి అమెరికా సైబర్ భద్రతా డొల్లతను మరోసారి బయటపెట్టింది.
ఇవి కూడా చదవండి








