SRH: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, మైదానంలోకి కెప్టెన్ కమిన్స్..!
ఐపీఎల్ 2026 సీజన్లో కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు భారీ ఊరట లభించింది. వెన్నునొప్పి (Back Injury) కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా అతనికి నిర్వహించిన స్కానింగ్ రిపోర్ట్స్‌లో పాజిటివ్ ఫలితాలు రావడంతో, చెన్నై సూపర్ కింగ్స్ తో (CSK) జరగబోయే కీలక పోరులో కమిన్స్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఎస్ఆర్హెచ్పై తీవ్ర ప్రభావం చూపింది. బౌలింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా జట్టు ఇబ్బంది పడింది. ఇప్పుడు కమిన్స్ పునరాగమనం ఖాయం కావడంతో యజమాని కావ్య మారన్, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. చెన్నై వంటి బలమైన జట్టుతో తలపడబోయే ముందు కమిన్స్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొన్ని రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్‌కు వైద్యులు స్కానింగ్ నిర్వహించారు.
ఆ రిపోర్ట్స్ అన్నీ క్లియర్ గా వచ్చాయని, గాయం దాదాపు నయమైందని తేలింది. దీంతో అతను వెంటనే టీమ్ క్యాంప్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన కమిన్స్, పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు సమాచారం. బలమైన జట్లను అడ్డుకోవాలంటే కమిన్స్ లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం. అతని రాకతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కమిన్స్ సేవలు జట్టుకు చాలా కీలకం కానున్నాయి. కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే.








