కావ్య మారన్- అనిరుధ్ రిసెప్షన్‌కు కేటీఆర్ దంపతులకు ఆహ్వానం
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్(Kalanidhi maran) దంపతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను ఆయన సతీమణి శైలిమ(Sailima)తో కలిసి హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్(Kavya maran), ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander)ల పెళ్లి రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానించారు. నవంబర్ 21న చెన్నైలో నిర్వహించనున్న ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను కేటీఆర్ దంపతులకు అందజేశారు.
కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్(Kaveri maran) స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆహ్వానాన్ని అందుకున్న కేటీఆర్.. కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్‌లకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి జీవితంలో కొత్త అధ్యాయం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంగా కళానిధి మారన్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) దంపతులను సైతం కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం.
కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ల పెళ్లికి సంబంధించి గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇరు కుటుంబాల నుంచి పెళ్లి డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం నవంబర్ 21న చెన్నైలో జరగనున్న రిసెప్షన్పై క్లారిటీ రావడంతో ఈ వేడుకపై ఆసక్తి నెలకొంది. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. కావ్య- అనిరుధ్ పెళ్లి నవంబర్ 11న గ్రీస్ లో జరగనున్నట్టు తెలుస్తోంది.








