సాయితేజ్ ముంగిట భారీ టార్గెట్
మెగా హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej) నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సంబరాల ఏటిగట్టు(SYG) షూటింగ్ పూర్తైంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా కోసం గుబురు గడ్డంతో కనిపించిన ఆయన, తాజాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ముగించారు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకు రెడీ అయ్యారు. మరోవైపు, సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే డిసైడ్ చేశారు. హనుమాన్(hanuman) తో సక్సెస్ ను అందుకున్న నిర్మాతలు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రోహిత్ కేపీ(Rohit kepi) తెరకెక్కిస్తున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే, సాయిధరమ్ తేజ్ మార్కెట్ స్థాయిని మించి ఈ ప్రాజెక్టుపై నిర్మాతలు పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాన్ థియేట్రికల్ బిజినెస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయినప్పటికీ, పెట్టిన ఖర్చులను పూర్తిగా రాబట్టాలంటే థియేటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది. గతంలో సాయితేజ్ నటించిన సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లను అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, సంక్రాంతి సీజన్లో పలు భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో పోటీ కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో సంబరాల ఏటిగట్టు(Sambarala yeti gattu) వాయిదా పడుతుందంటూ ప్రచారం జరిగినా, మేకర్స్ మాత్రం జనవరి 12 రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. డిసెంబర్ నుంచి సాయిధరమ్ తేజ్ ప్రమోషన్లలో పాల్గొననున్నారు. ఈ ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు ఆడియన్స్ ను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.








