శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల(Sree leela)కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్(karthik aryan) హీరోగా, అనురాగ్ బసు(anurag basu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2027 ఏప్రిల్ 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో 2025 డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, నిర్మాణ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత 2026లో రిలీజయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ రావడంతో ఈ ప్రాజెక్టుపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.
టీ సిరీస్(T Series) బ్యానర్‌పై భూషణ్ కుమార్(Bhushan kumar), కృష్ణ కుమార్(Krishna kumar) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్(Preetham) మ్యూజిక్ అందిస్తున్నారు. లవ్ స్టోరీకి మ్యూజిక్ ను కీలకంగా మేళవిస్తూ అనురాగ్ బసు(Anurag basu) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ ఓ సింగర్ గా కనిపించనున్నట్లు ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సంకేతాలిచ్చారు. గిటార్‌తో రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన క్యారెక్టర్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే సినిమా టైటిల్‌ను మాత్రం మేకర్స్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే, ఈ సినిమాను తూ మేరీ జిందగీ హై(Tu meri zindagi) అనే టైటిల్ తో ప్రచారం చేసినప్పటికీ, ఆ టైటిల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ ప్రాజెక్టుకు ఆషికీ(aashiqui) ఫ్రాంచైజీతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. తెలుగు, కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల(Sreeleela)కు ఈ సినిమా బాలీవుడ్ లో తొలి అడుగు కానుంది. బాలీవుడ్లో ఆమె కెరీర్‌కు ఈ సినిమా ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో చూడాలి.








