శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం : పీవీఎన్ మాధవ్
భయానక, బీభత్స వాతావరణం సృష్టించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు చూస్తున్నారు. అందర్నీ కఠినంగా శిక్షిస్తాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav) స్పష్టం చేశారు. అరాచక శక్తులను రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రజల్ని కోరారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తమను ఎవరేం చేస్తారంటూ నామినేషన్ల తొలిరోజే దౌర్జన్యాలకు తెగబడ్డారు. తిరుపతి (Tirupati), పుంగనూరు ( Punganur), రాయచోటీల్లో విచ్చలవిడిగా వ్యవహరించారు. ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) వాహనంతో కార్యకర్తలను ఢీకొట్టేలా వేగంగా దూసుకెళ్లడం, అడ్డుకున్నవారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దాడులకు ప్రయత్నించడం వంటి ఘటనలు ఆందోళనకరం. తిరుపతిలో కరుణాకర రెడ్డి (Karunakar Reddy) తన కుమారుడితో వెళ్లి మహిళా అభ్యర్థుల దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు అని మండిపడ్డారు.








