కొవ్వూరులో వైసీపీ షాక్
పురపాలిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీలో ఉండే చైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన మరుసటి రోజే ఆ పార్టీ నాయకత్వానికి తూర్పుగోదావరి జిల్లాలో ఎదురుదెబ్బ తలిగింది. కొవ్వూరూ(Kovvuru) వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్గా మన్నె పద్మ (Manne Padma) పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ (Venugopala Krishna), మాజీ ఎమ్మెల్యేలు, జక్కంపూడి రాజా(Jakkampudi Raja), తలారి వెంకటరావు (Talari Venkatarao) తదితరులు పాల్గొన్న సమావేశానికి ఆమె హాజరై పోటీ చేసేందుకు అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమెకు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో నాయకులంతా అక్కడి నుంచి నిష్రమించినట్లు సమాచారం. అనూహ్య పరిణామాన్ని ఎదుర్కొన్న నాయకులు ఆ సమాచారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆమె తండ్రి కోడూరి శివరామకృష్ణ (Koduri Sivaramakrishna) ఎమ్మెల్సీగా, ఐదు దఫాలు మున్సిపల్ చైర్మన్గా సేవలందించారు. ఆయన నివాసంలోనే జిల్లా ముఖ్య నాయకులు సమాలోచనలు చేశారు. ఈ పరిణామంతో అక్కడి వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న వారు సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.








