వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పులివెందులలో సీఐ పురుషోత్తం రాజు(Purushotham Raju) ఈ నోటీసులు( Notices) అందించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని నోటీసులో పేర్కొన్నారు. వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy), అంజాద్బాషా (Amjad Basha)కు కూడా నోటీసులు ఇచ్చారు. అల్లర్లు, గొడవలకు పాల్పడవద్దని నేతలను పోలీసులు కోరారు.








