ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలి : బొండా ఉమ
స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ హింస చోటుచేసుకోవడం పై తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలైనా హింసా మార్గంలో గెలవాలన్నదే వైసీపీ నైజమని ఆరోపించారు. పుంగనూరు (Punganur)లో ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీలు అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వం (Parliamentary Membership) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలన్నారు. అలాగే వైసీపీ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.








