ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంటే.. భారత్ మాత్రం అభివృద్ధి : కిషన్ రెడ్డి
రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు, కేంద్రాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పది నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించేలా రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యవహరిస్తున్నారని అన్నారు. 2029 వరకు ప్రధానిగా మోదీ(Modi) ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. బంగ్లాదేశ్(Bangladesh), శ్రీలంక (Sri Lanka)లో చేసినట్లు ప్రభుత్వాన్ని కూల్చుతామని దింపుడుకల్లం ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, భారత్ మాత్రం అభివృద్ధి చెందుతోంది. రాహుల్ గాంధీ తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదు అని అన్నారు.








