కావ్యా మారన్‌తో అనిరుధ్ పెళ్లి .. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ల వివాహ రిసెప్షన్‌కు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 21న చెన్నైలో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు స్వయంగా ఆహ్వానించారు.
హైదరాబాద్‌లో పర్యటించిన కళానిధి మారన్, ఆయన అర్ధాంగి కావేరి మారన్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ రిసెప్షన్‌కు తప్పకుండా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.








