జైలర్2లో హృతిక్ రోషన్ రెమ్యూనరేషన్ పై వార్తలు
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటించిన జైలర్2(jailer2) ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు గెస్ట్ రోల్స్ లో కనిపించి సందడి చేశారు. అయితే, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(hrithik roshan) చేసిన క్యామియో మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఈ స్పెషల్ క్యామియోలో హృతిక్ కనిపించేది నిమిషం కంటే తక్కువ సమయమేనని తెలుస్తోంది. ఇంత తక్కువ రన్ టైమ్ క్యారెక్టర్ కు ఆయన ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హృతిక్ క్యారెక్టర్ కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లేకపోవడంతో ఫ్యాన్స్, సినీ ఆడియన్స్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన క్యారెక్టర్ ను ఎడిటింగ్‌లో తగ్గించారా? లేక మొదటి నుంచీ ఇంత తక్కువ రన్ టైమ్ తోనే రూపొందించారా? అనే అంశంపై క్లారిటీ లేదు. మరోవైపు, విద్యాబాలన్(Vidya Balan)కు రూ.6 కోట్లు, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్(Shivaraj kumar)కు రూ.8 కోట్లు రెమ్యూనరేషన్ గా అందినట్టు సమాచారం. విజయ్ సేతుపతి(Vijay sethupathi) క్యారెక్టర్ ను పూర్తిగా కుదించడంతో ఆయన ఎండ్ క్రెడిట్స్‌లో మాత్రమే కనిపిస్తారని, జైలర్3(jailer3)కి సంబంధించి కీలక లీడ్ ఇచ్చేలా ఈ సీన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇక రజనీకాంత్ ఈ సినిమా కోసం రూ.110 కోట్ల బేస్ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకునే డీల్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన మొత్తం రెమ్యూనరేషన్ రూ.180 కోట్లకు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. అయితే, భారీ రెమ్యూనరేషన్లు, స్టార్ క్యామియోల కంటే వాటికి కథలో ఎంత ప్రాధాన్యం ఉందన్నదే ఇప్పుడు ఆడియన్స్ లో డిస్కషన్ కు దారితీస్తోంది.








