ఈ విషయంలో అధిష్ఠానం పునరాలోచన చేయాలి : మంత్రి సంధ్యారాణి భావోద్వేగం
సుదీర్ఘ కాలం తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ అందించిన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ (Salur Municipality)ని పుర ఎన్నికల్లో జనసేన (Jana Sena)కు కేటాయించడం పై టీడీపీ నాయకులు (TDP leaders), కార్యకర్తలు కలత చెందుతున్నారంటూ మంత్రి సంధ్యారాణి (Sandhyarani) భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆవేదన భరించలేకపోతున్నానని, ఈ విషయంలో అధిష్టానం పునరాలోచన చేసేలా కృషి చేయాలని సాలూరులో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడి (Atchannaiyudu)ని కోరారు. ఎస్టీ ఎమ్మెల్యేను గెలిపించేందుకు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఇక్కడి టీడీపీ నేతలు, బీసీ (BC) లకు అన్యాయం జరిగిందని సంధ్యారాణి పేర్కొన్నారు. పార్టీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని విన్నంచారు.








