జైలర్2 కలెక్షన్లకు నార్త్ ఇండియా మల్టీప్లెక్స్ అడ్డంకులు!
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన జైలర్2(jailer2)కు నార్త్ ఇండియాలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఈ సినిమాకు అక్కడ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ దక్కకపోవడానికి మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ కాకపోవడం మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్(PVR Inox), సినీపోలిస్(Cine police) వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లలో సినిమా రన్ కాకపోవడంతో సిటీ ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ థియేటర్లకు వెళ్లే వారి సంఖ్యపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
సౌత్ లో భారీ సినిమాల హిందీ రిలీజ్ విషయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఓటీటీ నిబంధనలపై పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ ఉండాలనే షరతును అవి ప్రధానంగా ముందుకు తెస్తున్నాయి. మరోవైపు, ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలకు డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేస్తుండటంతో నిర్మాతలు ముందస్తు డీల్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. హిందీ థియేట్రికల్ కలెక్షన్లపై పూర్తి భరోసా లేకపోవడంతో ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉండటం లేదు.
ఈ సిట్యుయేషన్ సౌత్ సినిమాల హిందీ మార్కెట్‌కు ఛాలెంజ్ గా మారుతోంది. జైలర్2కు మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ లభించి ఉంటే, నార్త్ ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్లు ప్రస్తుతం నమోదైన అంచనాల కంటే రెట్టింపు స్థాయికి చేరుకునే అవకాశముండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింగిల్ స్క్రీన్లకు దూరంగా ఉండే పట్టణ ప్రేక్షకులను చేరుకోవాలంటే మల్టీప్లెక్స్ రిలీజ్ కీలకం. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, థియేటర్ యాజమాన్యాల మధ్య ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే ఫ్యూచర్ లో సౌత్ భారీ సినిమాల హిందీ కలెక్షన్లకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదముంది.








