BJP: డైలీ సీరియల్ లా ఫోన్ ట్యాపింగ్ విచారణ..!
కేసీఆర్ సిట్ విచారణపై బీజేపీ షాకింగ్ రియాక్షనిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియల్లాగా సాగదీస్తున్నారని, ఇది ఇంకెంతకాలం కొనసాగుతుందో చూడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. షార్ట్ ఫిలిం అయితే ఎప్పుడో ముగిసేదని, సీరియల్ కాబట్టే ఇంకా సాగుతున్నదని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణపై ఆయన స్పందించారు. ‘‘తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే ఆరోపించారని గుర్తు చేశారు.
హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ వేసింది. అయినా ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ట్యాపింగ్ జరిగింది. సొంత కుటుంబ సభ్యులు, మంత్రులు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభుత్వమే అఫిడవిట్ వేసింది. ఇది తీవ్రమైన నేరం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి’’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పేందుకు తాను పోలీస్ కాదని, చట్టం తన పని తాను చేసుకోవాలన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఫోన్ ట్యాపింగ్ కేసుపై(Phone Tapping Case) బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు (BJP Medak MP Raghu nandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలోనే పూర్తి కావాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు. తప్పు చేసినవారు కొడుకైనా, కూతురైనా జైలుకు పంపుతానని.. 2014 జూన్లో మాజీ సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడారని ప్రస్తావించారు రఘునందన్. ఆ మాటలు.. కేసీఆర్కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. సిట్ విచారణ అంతా డ్రామాలా ఉందంటున్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా సమగ్రంగా విచారణ జరిపి నిందితులను జైల్లో వేయాలన్నారు.






