KCR: సిట్ విచారణకు ఫాంహౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ కోసం ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ నుంచి బయల్దేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఆయన కదలికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నోటీసుల తదుపరి పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆయన ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ రాకతో అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరగగా, రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ నాయకుడికి మద్దతుగా కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.






