అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు?
దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారణకు ఎందుకు పిలిచింది? ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదాం. కేంద్రంతో ఎలా పోరాడుతున్నామో కవితకు తెలియదా? అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్ణయాలను వివరిస్తామని అన్నారు.








