గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి : కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ (Srinivasavarma) ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కలిశారు. బయ్యారం (Bayyaram)లో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కుమారస్వామి (Kumaraswamy)కి విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ఉక్కు కొరత తగ్గడంతోపాటు, పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను రేవంత్ వివరించారు. పాత వాహనాల స్క్రాప్ ను రీసైక్లింగ్ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ను కాలుష్యం లేని నగరంగా మార్చేదుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.








